Monday, December 23, 2024

24 గంటల్లో కరోనాతో 19 మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ఒకే రోజున గత 24 గంటల వ్యవధిలో 10,158 వరకు కొత్తగా కరోనా కేసులు పెరిగాయి. మంగళవారం 7830 వరకు కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య ఇప్పుడు పదివేలకు దాటింది. 19 మంది మృతి చెందారు. వీరిలో నలుగురు కేరళలో మరణించినట్టు సవరించిన గణాంకాల ప్రకారం వెల్లడైంది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజా వివరాల ప్రకారం యాక్టివ్ కేసులు 44998 వరకు పెరిగాయి. కొత్తగా 19 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 5,31,035 కి పెరిగింది. గురువారం ఉదయం 8 గంటల వరకు అందిన వివరాల ప్రకారం తాజా మృతుల సంఖ్యలో మహారాష్ట్రలో 9 మంది, గుజరాత్‌లో ఇద్దరు, ఢిల్లీ, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, రాష్ట్రాల్లో ఒక్కొక్కరు వంతున చనిపోయారు. కేరళలో సమీక్షించిన తరువాత నలుగురు చనిపోయారని తేలింది.

Also read: ‘ఏజెంట్’ నుంచి ‘రామాకృష్ణా..’ సాంగ్ విడుదల

బుధవారం నాడు మొత్తం 10,158 కేసులు నమోదయ్యాయి. గత 230 రోజుల్లో ఇదే అత్యధిక కేసుల సంఖ్య. గత ఏడాది ఆగస్టు 26న మొత్తం 10,256 కేసులు నమోదయ్యాయి. అలాగే బుధవారం 7836 వరకు కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో 21.6 శాతం, మార్చిలో 35.8 శాతం మేర కరోనా కేసులు పెరిగాయి. ప్రస్తుతం మన దేశంలో కొవిడ్ ఎండమిక్ దశ కు చేరుకుందని అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ క్రమం లోనే రాబోయే 1012 రోజుల పాటు కేసుల ఉధృతి కొనసాగుతుందని చెప్పాయి. ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉన్నట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News