న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. ముందు రోజుల 10 వేల దిగువన నమోదైన కొత్త కేసులు, తాజాగా 15 శాతం మేర పెరిగాయి. మంగళవారం 12,42,177 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 10,197 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఒక్క కేరళ లోనే 5516 మందికి కరోనా సోకింది. దేశ వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 301 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 210 మరణాలు కేరళ లోనే చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు 3.34 కోట్ల మందికి కరోనా సోకగా, 4,64,153 మంది మృతి చెందారు. కరోనా వ్యాప్తి తగ్గడంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గి 527 రోజుల కనిష్ఠానికి చేరాయి. ప్రస్తుతం 1,28,555 మంది వైరస్‌తో భాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.37 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 98.28 శాతానికి చేరింది. మంగళవారం 12,134 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, మొత్తం రికవరీలు 3.38 కోట్లకు చేరాయి. మంగళవారం 67,82,042 మంది టీకా వేయించుకున్నారు. దాంతో మొత్తం పంపిణీ అయిన డోసుల సంఖ్య 113 కోట్ల మార్కును దాటింది.
527 రోజుల కనిష్ఠానికి తగ్గిన క్రియాశీల కేసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -