- Advertisement -
1 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల బాగా కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసులు 10 వేలకు దిగివచ్చాయి. మరోవైపు మరణాలు కూడా 250 లోపే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 10,22,204 కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా 10,273 కేసులు బయటపడ్డాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతానికి తగ్గింది. శనివారం 243 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, ఇప్పటివరకు మృతుల సంఖ్య 5,13,724 కు చేరింది. శనివారం 20,439 మంది వైరస్ నుంచి కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4.22 కోట్లు దాటింది. ఆ రేటు 98.54 శాతానికి చేరింది. ప్రస్తుతం క్రియావీల కేసుల సంఖ్య 1,11,472 కు తగ్గి, ఆ రేటు 0.26 శాతానికి క్షీణించింది. శనివారం 24,05,049 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 177 కోట్లు దాటింది.
- Advertisement -