Monday, January 20, 2025

దక్షిణ దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ : మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ రాష్ట్ర సందను పెంచి రాష్ట్రంలోని పేద ప్రజలకు పంచుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ సేవలను పిహెచ్‌సిలకు విస్తారించామని మంత్రి అన్నారు. దేశంలో మన దగ్గర ఎక్కువగా డాక్టర్లు అవుతున్నారని, రికార్టు స్థాయిలో డాక్టర్ల నియామకం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. నీళ్లు , నిధులు, నియామకం కోసం ఉద్యమం చేసి ఇతర రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. దక్షిణ దేశానికి ధాన్యగారంగా తెలంగాణ మారిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలనలో 60 ఏళ్లలో మూడు మెడికల్ కళాశాలలు వస్తే ఆరు ఏళ్ళలో 12 మెడికల్ ఏర్పాటు చేశామని సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగాల నియామకంలో మొదటి దశలో 1.47 లక్షల ఉద్యోగాలు పూర్తి చేశామని, ఇప్పుడు 81 వేల ఉద్యోగాలు భర్తి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో మొదటగా 929 మంది డాక్టర్లు విధుల్లో చేరబోతున్నారని అన్నారు. ఒక్క వైద్యశాఖలోనే అనేక నియామకాలు కేటాయించామని, మరో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. మరో మూడు నెలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరుగుతుందని మంత్రి అన్నారు. 5204 స్టాఫ్ నర్స్‌లకు నోటిఫికేషన్ ఇచ్చామని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో 4 నెలల్లో 10,283 ఖాళీలు భర్తి చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్య ఆరోగ్యశాఖలో 21,202 ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News