Sunday, December 22, 2024

ఒక్క రోజే వెయ్యి దాటిన కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

1054 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కరోజే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 44,202 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,054 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 795 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,992 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 630 మంది ఫలితాలు రావాల్సి ఉంది. రాష్ట్రంలో హైదరాబాద్‌లో అత్యధికంగా 396 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 60 కేసులు, నల్గొండలో 49, రాజన్న సిరిసిల్లలో 36, కరీంనగర్‌లో 46, ఖమ్మంలో 35, పెద్దపల్లిలో 35, సంగారెడ్డిలో 29, మంచిర్యాలలో 31 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News