Sunday, November 3, 2024

ఎపిలో కరోనా తగ్గుముఖం

- Advertisement -
- Advertisement -

1063 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,063 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 11 మరణాలు సంభవించాయి. కరోనాతో చికిత్సపొందుతూ సోమవారం నాడు 1,929 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 19,65,657 మంది కోలుకున్నారు గత 24 గంటల్లో 59,198 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 2,57,67,609 మందికి కరోనా పరీక్షలు చేశారు. మొత్తం 13,671 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 16,341 యాక్టివ్ కేసులున్నాయి.

కర్ఫ్యూలో సడలింపులు…

కరోనా మూడో దశ నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ఎపి సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు చేసినట్లు తెలిపారు. తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News