న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గుర్తించిన 26 గ్యాంగులు చురుకుగా ఉన్నాయని, మొత్తం 188 మంది గ్యాంగు సభ్యుల్లో 107 మంది ప్రస్తుతం జైళ్లలో ఉన్నారని ఢిల్లీ పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఢిల్లీ లోని రోహిణి కోర్టులో విచారణ జరుగుతుండగా కాల్పులు జరగడం, గ్యాంగ్‌స్టర్ గోగి హత్యకు గురి కావడంతో ఢిల్లీ జైళ్లలో భద్రతాపరమైన హై అలర్డ్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రైమ్ బ్రాంచి జాయింట్ పోలీస్‌కమిషనర్ అలోక్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వ్యవస్థీకృత నేరాలు, అంతర్జాతీయ తరహా నేరాలను తుద ముట్టించడానికి జిల్లా పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్ చురుకుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. రోహిణీ కోర్టు సంఘటనపై మాట్లాడుతూ ఈ సంఘటనలో రెండు మూడు గ్యాంగులున్నాయని, గోగి, లారెన్స్, బిష్ణోయ్ , కాలాజధేరి మధ్య అలయన్స్ ఉందన్నారు. ఈ గ్యాంగులు ఒకరికొకరు సాయం చేసుకుంటాయని, చెప్పారు. అంతర్రాష్ట్ర గ్యాంగుల్లో పేరున్న వాళ్లు దాదాపు జైళ్ల లోనే ఉన్నారని అలోక్‌కుమార్ చెప్పారు.
ఢిల్లీ జైలులో 107 మంది గ్యాంగ్‌స్టర్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -