Thursday, January 23, 2025

రాష్ట్రపతి ఎన్నికల్లో 107 నామినేషన్ల తిరస్కరణ..

- Advertisement -
- Advertisement -

ముర్ము, సిన్హా మధ్యనే పోటీ
రాష్ట్రపతి ఎన్నికల్లో 107 నామినేషన్ల తిరస్కరణ

న్యూఢిల్లీ: నామినేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాత జులై 18న రాష్ట్రపతి పదవికి జరగనున్న ఎన్నికలలో ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాత్రమే పోటీలో ఉన్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ మంగళవారం ప్రకటించారు. బుధవారం వరకు 94మంది వ్యక్తుల నుంచి 115 నామినేషన్ పత్రాలు వీటిలో 107 నామినేషన్లను తిరస్కరిచడం జరిగిందని రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న పిసి మోడీ తెలిపారు. ముర్ము, సిన్హా నాలుగేసి సెట్ల చొప్పున నామినేషన్లు సమర్పించగా వీటిని ఆమోదించినట్లు ఆయన తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ అయిన జులై 2వ తేదీ సాయంత్రం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను గెజిట్‌లో ప్రచురిస్తామని ఆయన చెప్పారు.

107 Nomination refused for Presidential Poll 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News