Monday, January 20, 2025

చైనాలో 10,000 పైగా కొత్త కోవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

 

బీజింగ్: చైనాలో మరోసారి కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తోంది. నిన్న ఒక్కరోజే 10.729 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. జీరో కోవిడ్ వ్యూహం అమలు చేస్తున్నా కేసులు అదుపులోకి రావడం లేదు. కేసులు అధికం కావడంతో బీజింగ్ లోని పార్కులను అధికారులు మూసివేశారు. చైనావ్యాప్తంగా మరోసారి కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చైనాలోని అనేక నగర పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులకు మారాయి, ఆసుపత్రులు సేవలను పరిమితం చేశాయి. కొన్ని దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేయబడ్డాయి, వారి సిబ్బందిని నిర్బంధానికి తీసుకెళ్లారు. పలు నగరాల్లో లాక్ డౌన్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News