Wednesday, January 22, 2025

‘ఎన్‌బికె 107’ టైటిల్ లాంచ్ వేదిక ఖరారు…

- Advertisement -
- Advertisement -

First Hunt loading from 'NBK107'

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఎన్‌బికె 107’ టైటిల్ లాంచ్ వేడుక ఈ నెల 21న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వేదికగా కర్నూల్ కొండా రెడ్డి బురుజును ఎంపిక చేయడం విశిష్టతను సంతరించుకుంది. టాలీవుడ్‌లో తొలిసారిగా కొండా రెడ్డి బురుజు వేదికగా వేడుక జరుపుకుంటున్న చిత్రం ‘ఎన్‌బికె 107’ కావడం విశేషం. ఈనెల 21న రాత్రి 8:15 గంటలకు టైటిల్ లాంచ్‌కి ముహూర్తం ఖరారు చేశారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత సంచలనం తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్‌గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

#107NBK Movie title launch on Oct 21

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News