Thursday, December 19, 2024

లడఖ్‌లో 108 కిలోల బంగారం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

భారత్-చైనా సరిహద్దుల్లో 108 బంగారు కడ్డీలను ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసు(ఐటిబిపి) స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఐటిబిపి అధికారి ఒకరు బుధవారం తెలిపారు. ఒక్కో బంగారు కడ్డీ కిలో బరువు ఉన్నట్లు ఆయన చెప్పారు. స్మగ్లింగ్ చేసి తీసుకువచ్చిన బంగారు కడ్డీలతోపాటు రెండు మొబైల్ ఫోన్లు, ఒక బైనాకులర్, రెండు కత్తులు, కేకులు, పాలు వంటి చైనా తయారీ ఆహార పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆ అధికారి తెలిపారు. ఐటిబిపి చరిత్రలోనే ఇది అత్యంత భారీ స్వాధీనమని, స్వాధీనం చేసుకున్న వస్తువులను కస్టమ్స్ శాఖకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. వేసవి కాలంలో స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉన్న కారణంగా స్మగ్లర్ల కార్యకలాపాలను అరికట్టేందుకు చిజ్‌బులే

, నర్బులా, జాంగిల్, జాకియాతోసహా తూర్పు లడఖ్‌లోని చాంగ్‌థాంగ్ సబ్ సెక్టార్‌లో ఐటిబిపి బలగాలు మంగళవారం మధ్యాహ్నం నుంచి విస్తృతంగా తనికీలు చేపట్టాయి. వాస్తవాధీన రేఖకు కిలోమీటరు దూరంలోని శ్రీరాపిల్‌లో స్మగ్లింగ్ జరుగుతున్నట్లు ఐటిబిపికి సమాచారం అందింది. గాడిదపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారు తప్పించుకుని పరారయ్యారు. వారిని వెంబడించి పట్టుకుని తనిఖీలు జరపగా బంగారు కడ్డీలతోసహా ఇతర వస్తువులు లభించినట్లు అధికారి చెప్పారు. వారు ఇచ్చిన సమాచారంతో మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. వీరంతా లడఖ్‌లోని న్యోమా ప్రాంతానికి చెఇందిన వారిగా అధికారులు గుర్తించారు. మరింత సమాచారం కోసం ఐటిబిపి, పోలీసులు సంయుక్తంగా ప్రశ్నిస్తున్నట్లు అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News