Monday, January 20, 2025

నవజాత శిశువుల కోసం 108 ప్రత్యేక వాహనం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ :జిల్లాలో నవజాత శిశువులను సంరక్షించి, వారు వ్యాధుల బారిన పడకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం నవజాత శిశువుల కోసం ప్రత్యేక 108 వాహనాలను ఏర్పాటు చేసిందని రా ష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.శనివారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కేంద్రంలోని మాతశిశు ఆరోగ్య కేంద్రం వద్ద అత్యాధూనిక సాంకేత సదుపాయాలు కలిగిన 108 వాహనాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ , జిల్లా కలెక్టర్ తో కలిసి రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ,నవజాత శిశువులకు వ్యాధులు సంక్రమణ అవకాశాలు అధికంగా ఉంటాయని, అలాంటి పరిస్థితుల్లో వారికి మెరుగైన వైద్యం అందించడానికి ఇతర

అసుపత్రులకు తరలించే క్రమంలో అనారోగ్యం కారణంగా ఇబ్బందులకు గురికాకుండా ఉన్నతస్థాయి సంరక్షణను అందించేలా అదునాతన వెంటిలేటర్ మ రియు పర్యవేక్షణ సామర్థ్యాలతో పిడియాట్రిక్ ఐఎఫ్ టి అనే ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ వాహనంలో 14 రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో నగర మేయర్ వై.సునీల్ రావు, జడ్పీ చైర్ పర్సన్ క నుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ డాక్టర్. బి గోపి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపర్డెంట్ కృష్ణ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలితాదేవి, ఆర్‌ఎంఓ డాక్టర్ జ్యోతి, వైద్యాధికారు లు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News