Thursday, January 23, 2025

సిపిఆర్‌ తో పసికందుకు ప్రాణం పోసిన 108 సిబ్బంది

- Advertisement -
- Advertisement -

కీసర: నెలలు నిండాకుండా పుట్టిన పసికందుకు ఊపిరి ఆడక పోవడంతో కీసర 108 సిబ్బంది సీపీఆర్ చేసి తిరిగి ప్రాణం పోశారు. కీసర మండలం కుందన్‌పల్లి గ్రామంలోని కోళ్ల ఫారం వద్ద కూలీగా పనిచేస్తూ కుటు ంబ సభ్యులతో నివాసం ఉంటున్న గర్బిణీ ఆర్తి కుమారి (20) ఆదివారం అర్థ రాత్రి పురుటి నొప్పులతో కీసరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు నెలలు పూర్తిగా నిండకపోవడం, గర్బంలో శిశువు ఎదుగుదల సరిగా లేక పోవ డం, మొదటి కాన్పు కావడంతో ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్ధిక స్థోమత లేని కుటుంబ సభ్యులు అక్కడి వైద్యుల సూచనల మేరకు గాంధీ ఆసుపత్రికి వెళ్లే నిమిత్తం 108కు సమాచారం అందజేశారు. దీంతో కీసర 108 సిబ్బంది ఆర్తి కుమారిని అంబులెన్సులో గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో పురుటి నొప్పులు తీవ్రమయ్యాయి.

Also Read: మోడీజీ.. తిట్లకే భయపడితే ఇక మీరేం నేతలు

అత్యవసరంగా డెలివరి చేయా ల్సిరావడంతో ఈఎంటీ చిత్రం రవి ఆర్తి కుమారికి అంబులెన్సులోనే సుఖ ప్రస వం చేశాడు. నెలలు నిండకుండా పుట్టిన పసికందు తక్కువ బరువుతో పల్స్ పని చేయక పోవడం, శ్వాస తీసుకోకపోవడం, గుండె చప్పుడు లేకపోవడంతో 108 డాక్టర్ ఈఆర్‌సీపీ డా.మహీద్‌ను ఫోన్‌లో సంప్రదించి బిడ్డ పరిస్థితిని వివరిం చారు. డాక్టర్ మహీద్ సూచనల మేరకు ఈఎంటీ రవి పసికందుకు సీపీఆర్ చేస్తూ, బ్యాగ్‌తో శ్వాస అందిస్తూ, ఆక్సిజన్ సరపరా చేస్తూ గాంధీ ఆసుపత్రికి చేర్చారు. పసికందును పరిశీలించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అత్యవసర సమయంలో సీపీఆర్ చేయడంతో పసికందు తిరిగి ప్రాణం పోసుకుందని చెప్పి కీసర 108 సిబ్బందిని అభినందించారు. గర్బిణీకి అంబులెన్సులో సుఖప్రసవం చేసి బిడ్డకు సీపీఆర్ ద్వారా తిరిగి ప్రాణం పోసిన 108 సిబ్బందికి ఆర్తి కుమారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News