- Advertisement -
తిరుపతి: కాలినడకన వెళ్తున్న శ్రీవారి భక్తులపైకి అంబులెన్స్ దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామ శివారులో జరిగింది. కొంత మంది శ్రీవారు భక్తులు పుంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన వెళ్తున్నారు. నరసింగాపురం గ్రామ శివారులో శ్రీవారి భక్తులపైకి 108 వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. మృతులు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ(40), లక్ష్మమ్మ(45)గా గుర్తించారు. అంబులెన్స్‌లో మదనపల్లె నుంచి తిరుపతికి రోగిని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- Advertisement -