Thursday, January 23, 2025

సైన్స్ కాంగ్రెస్ వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 109వ అఖిలభారత సైన్స్ మహాసభ వాయిదాపడింది. నిర్ణీతంగా అయితే ఈ సైన్స్ కాంగ్రెస్ జనవరి 3 నుంచి ఆరంభం కావల్సి ఉంది. అయితే ఈ సదస్సుకు ఆతిధ్యం ఇవ్వడం తమకు కుదరదని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ తెలియచేయడంతో ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు పాల్గొని , శాస్త్రీయ విషయాలపై చర్చించే ఈ వేదిక అనిశ్చితకు దారితీసింది. ఈ వార్షిక సమావేశాన్ని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్‌సిఎ) నిర్వహిస్తుంది. ఈ సదస్సుకు ఆతిధ్యం ఇవ్వాల్సిందని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు బహిరంగంగా విజ్ఞప్తి చేయాలని ఈ సంఘం నిర్ణయించింది. 1914 నుంచి ఐఎస్‌సిఎ తరఫున ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రతిసారి ఈ సదస్సును దేశ ప్రధాని ప్రారంభించడం ఆనవాయితీగా ఉంది. శుక్రవారం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కార్యవర్గ కమిటీ సమావేశం జరిగింది.

ఇందులో సదస్సు 109వ అధ్యాయం వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏ విశ్వవిద్యాలయం అయినా ఈ సదస్సు నిర్వహణకు ముందుకు రావచ్చునని సంఘం వెబ్‌సైట్ ద్వారా ప్రకటన పొందుపర్చినట్లు ఐఎస్‌సిఎ అధ్యక్షులు అర్వింద్ సక్సేనా వార్తాసంస్థలకు తెలిపారు. ఫిబ్రవరి వరకూ తాము వేచిచూస్తామని, ఎక్కడ ఈ మహాసభను నిర్వహించాలనేది నిర్ణయిస్తామని చెప్పారు. కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ సైన్స్ టెక్నాలజీ విభాగానికి , ఈ సదస్సు నిర్వాహక సంఘం ఐఎస్‌సిఎకు మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. దీనితో 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ సైన్స్ కాంగ్రెస్ తరహాలోనే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్‌ఎఫ్)ను నిర్వహిస్తోంది. నిజానికి 109వ సైన్స్ సభలు లక్నో యూనివర్శిటీలో జరగాల్సి ఉంది.

ఈ వర్శిటీ కూడా ఈ కార్యక్రమ నిర్వహణ కుదరని పని అని తెలిపింది. లవ్లీ వర్శిటీ చివరి నిమిషంలో సదస్సు నిర్వహణ నుంచి వెనుదిరిగింది. తమను కాదని ఐఎస్‌సిఎ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోంటోందని పేర్కొంటూ వార్షిక సదస్సు స్పాన్సర్‌షిప్‌ను కేంద్రం నిలిపివేసింది. దీనితోనే ఇప్పుడు ఈ సదస్సు వాయిదా పడిందని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News