Thursday, January 23, 2025

ఉప్పల్ స్టేడియంలో సెలబ్రిటీ క్రికెట్‌ మ్యాచ్‌లు..10వేల మందికి ఫ్రీ ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా సినీ తారల క్రికెట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. వచ్చే నెల మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు రోజుకు రెండు చొప్పున మొత్తం ఆరు సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. అన్ని ఇండస్ట్రీల సెలబ్రిటీ టీమ్ లు ఈ మ్యాచ్ ల్లో పాల్గొననున్నాయి.

ఈక్రమంలో కాలేజ్ స్టూడెంట్స్ కు హెచ్ సీఎ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మూడు రోజులపాటు కొనసాగే ఈ మ్యాచ్ లకు కాలేజ్ విద్యార్థులకు ఫ్రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రతి మ్యాచ్‌కు 10 వేల మంది ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజ‌నీరింగ్‌, మెడిక‌ల్‌ విద్యార్థుల‌ను స్టేడియంలోకి ఉచితంగా అనుమ‌తిస్తామ‌ని తెలిపింది. ఇందుకోసం ముందుగా ఆసక్తి గల విద్యాసంస్థలు.. తమ విద్యార్థుల పేర్లను హెచ్ సిఎకు మెయిల్ చేసి అనుమతి పొందాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News