Wednesday, January 22, 2025

10 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్‌ః రంగారెడ్డి జిల్లా, ఘట్‌కేసర్ జంక్షన్ వద్ద కారులో తరలిస్తున్న రూ.10 లక్షల విలువ చేసే 10 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఘట్‌కేసర్ జంక్షన్ వద్ద ఘట్‌కేసర్ ఎక్సైజ్, మల్కాజిగిరి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించారు. వాహనాల సోదాలు జరుపుతుండగా కారులో తరలిస్తున్న రూ.10 లక్షలు విలువ చేసే 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న కరీంగనర్‌కు చెందిన ప్రణీత్ (24), కాకినాడకు చెందిన సతీష్ (25), పశ్చిమగోదావరికి చెందిన శివరాం (28), హన్మకొండకు చెందిన హేమంత్ (21),

కాకినాడకు చెందిన మధుకుమార్ (22)లను అదుపులోకి తీసుకున్నారు. కళాశాల విద్యార్థ్ధులైన వీరు గంజాయి అలవాటుతో అరకులో తక్కువ ధరకు కొనుగోలు చేసి మేడిపల్లి, కీసర చుట్టు పక్కల ప్రాంతాల్లోని కళాశాల విద్యార్థ్ధులకు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వీరి నుండి కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడిన ఐదుగురిని కోర్ట్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. ఈ తనిఖీలలో ఘట్‌కేసర్ ఎక్సైజ్ సీఐ మల్లయ్య, మల్కాజిగిరి టాస్క్‌పోర్స్ సిఐ భరత్, ఎస్‌ఐలు పురుషోత్తం రెడ్డి, ధన్‌రాజ్, శ్రావణి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News