Monday, December 23, 2024

’టెన్త్ క్లాస్ డైరీస్’ విజువల్ ఫీస్ట్..

- Advertisement -
- Advertisement -

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్‌ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా ’టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు.పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ’గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు ‘హిప్ హాప్’ తమిళ, హీరో ఆర్య ట్విట్టర్ ద్వారా టీజర్ విడుదల చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రచయిత బివిఎస్ రవి ఆవిష్కరించారు.

మార్చి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. “పనిలో అంజి చిచ్చరపిడుగు. అతను పెద్ద మాస్ దర్శకుడు అవుతారు. ఈ సినిమాకు అన్నీ మంచి సెంటిమెంట్స్ పడ్డాయి. ఈ చిత్రం మంచి హిట్టవ్వాలి” అని అన్నారు. చిత్ర నిర్మాత అచ్యుత రామారావు మాట్లాడుతూ “టెన్త్ క్లాస్ చదివిన ప్రతి మనిషి చూడాల్సిన సినిమా ఇది. ఆ అనుభూతులు గుర్తుకు వస్తాయి. అంజి ఇరగదీశాడు. విజువల్ ఫీస్ట్ సినిమా ఇది”అని తెలిపారు.

దర్శకుడు ‘గరుడవేగ’ అంజి మాట్లాడుతూ “ఈ సినిమాకు అవికా గోర్ పెద్ద ప్లస్ పాయింట్. క్లైమాక్స్‌లో ఆమె పర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. 96, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, కొత్త బంగారు లోకం సినిమాల తరహాలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమా ఉంటుంది” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అవికా గోర్, హిమజ, శ్రీనివాసరెడ్డి , చిన్నా, సుజీత్, ప్రవీణ్ పూడి, తదితరులు పాల్గొన్నారు.

10th Class Diaries Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News