హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 ,2023 నుంచి నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించినట్లు మంత్రి సబితా వెల్లడించారు. పదో తరగతి బోర్డు పరీక్షలకు కేవలం ఆరు పేపర్లే ఉంటాయని, ప్రతీ పరీక్షకు మూడు గంటల సమయం ఉంటుందని తెలిపారు. వంద శాతం సిలబస్‌తో పరీక్షల నిర్వహణ ఉంటుందని, వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ ఉండదని వివరించారు.నమూనా ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందుబాటులో ఉండాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. సెలవు రోజుల్లో కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక బోధన చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఫ్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని మంత్రి సబిత కోరారు.
ఏప్రిల్ 3వ తేది నుంచి పదవ తరగతి పరీక్షలు : మంత్రి సబిత
- Advertisement -
- Advertisement -
- Advertisement -