Friday, November 15, 2024

మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు

- Advertisement -
- Advertisement -

ఈసారి సైన్స్‌లో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్‌లకు వేర్వేరు రోజుల్లో పరీక్షలు
టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఉ.9.30 నుంచి మ. 12.30 వరకు పరీక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు టెన్త్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. 18న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీష్, 23న గణితం, 26న సైన్స్ మొదటి పేపర్, 28న సైన్స్ రెండవ పేపర్, 30న సోషల్ స్టడీస్, 1వ తేదీన ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు సంస్కృతం, ఆరబిక్ మొదటి పేపర్, 2న రెండవ పేపర్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షలలో సైన్స్ సబ్జెక్టు పరీక్షను రెండు రోజులపాటు నిర్వహించనున్నారు.సైన్స్‌లో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్‌లను వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెన్త్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సైన్స్ సబ్జెక్టు పరీక్షను రెండు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.రాజభాను చంద్రప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు.

టెన్త్ పరీక్షల షెడ్యూల్

2024 మార్చి 18 ప్రథమ భాష (ఫస్ట్ లాంగ్వేజ్)
2024 మార్చి 19 ద్వితీయ భాష (సెకండ్ లాగ్వేంజ్)
2024 మార్చి 21 ఇంగ్లీష్
2024 మార్చి 23 గణితం
2024 మార్చి 26 ఫిజికల్ సైన్స్(సైన్స్ పార్ట్ 1)
2024 మార్చి 27 బయోలాజికల్ సైన్స్(సైన్స్ పార్ట్ 2)
2024 మార్చి 30 సాంఘిక శాస్త్రం
2024 ఏప్రిల్ 1 ఓఎస్‌ఎస్‌సి పేపర్ -1
2024 ఏప్రిల్ 2 ఓఎస్‌ఎస్‌సి పేపర్ -2 (సంస్కృతం, అరబిక్)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News