Monday, December 23, 2024

మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్ధులు నేరుగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఎస్‌ఎస్‌సి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. పదవ తరగతి రెగ్యులర్, ప్రైవేటుఏ, ఓఎస్‌ఎస్‌సి, ఒకేషన్ విద్యార్ధులు తమ హాల్ టికెట్లు పొందేందుకు జిల్లా పేరు, స్కూల్ పేరు, పుట్టిన తేదిని నమోదు చేయాల్సి ఉంటుంది. ఈనెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీవరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

ఈఏడాది ఫిజికల్ సైన్సు, బయాలజీ రెండు సబ్జెక్టులకు వేరు వేరుగా పరీక్షలు జరగనున్నాయి. ఈరెండు సబ్జెక్టులకు ఉదయం 9.30 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.08 లక్షలమంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. 2676 పరీక్ష కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతరత్రా పేపర్లకు అనుమతి నిరాకరంచారు. ఈఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 5.08 లక్షల మంది విద్యార్ధులు రాయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News