Friday, December 20, 2024

పదో తరగతి ప్రశ్నపత్రం లీక్.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్.. రేపటి పరీక్ష యథాతథం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ప్రశ్నపత్రం లీక్ కావడం కలకలం రేపింది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎ. శ్నీదేవసేన తీవ్రంగా స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు ఉద్యోగులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సస్సెండ్ చెశారని తెలిపారు. చీఫ్ సూపరింటెడెంట్ శివకుమార్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కె. గోపాల్, ఇన్విజిలేటర్లు ఎస్. బందెప్ప, సమ్మెప్పపై సస్సెన్షన్ వేటు వేశారని వెల్లడించారు. బందెప్ప, సమ్మప్పలపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశామన్నారు. పరీక్ష మొదలయ్యాక ఇన్విజిలేటర్ బందెప్ప ప్రశ్నపత్రాన్నీ ఫొటో తీసి మరో ఉద్యోగి సమ్మెప్పకు వాట్పాప్ లో పంపించారని తెలిపారు. ఇన్నిజిలేటర్ బందెప్ప చేసింది మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తుందని స్షష్టం చేశారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగలేదని పేర్కొన్నారు. రేపు జరగబోయే పరీక్ష యథాతథంగా జరుగుతుందన్నారు. పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News