Saturday, December 21, 2024

30న పదో తరగతి ఫలితాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాల ప్రకటన తేదీ ఖరారయ్యింది. ఈ నెల 30వ తేదీన ప్రకటించనునన్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో ఉన్న 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది పరీక్షలు రాశారు. వీరిలో 2,57,952 మంది బాలురు కాగా, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.

ఈ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం ఇటీవల పూర్తి కాగా, వారం రోజుల పాటు ఫలితాల డీ -కోడింగ్ అనంతరం ఈ నెల 30న ఫలితాలను వెల్లడించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల కోడ్ దృష్ట్యా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, అధికారులు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News