హైదరాబాద్: ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో గురువారం ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,08,143 రెగ్యులర్ విద్యార్థులకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాశారు. 167 మంది ప్రయివేటు విద్యార్థులకు 87 మంది పరీక్షలకు హాజరయ్యారు. జూన్ 28 ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లో బాలికలదే హవా. బాలికలు 92.45 శాతం, బాలురు 87.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక, ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 97 శాతంతో మొదటి స్థానంలో, హైదరాబాద్ 79 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 15 స్కూల్స్‌లో ఒక్కరూ కూడా పాస్ అవలేదని మంత్రి తెలిపారు.
తెలంగాణ టెన్త్ ఫలితాల్లో బాలికలదే హవా
- Advertisement -
- Advertisement -
- Advertisement -