- Advertisement -
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. పదవ తరగతి పరీక్షలు రాసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. టిఎన్‌జివొ కాలనీకి చెందిన యువకుడు, తన సోదరిని పదవ తరగతి పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లాడు. పరీక్ష రాసి తిరిగి వస్తుండగా.. వాళ్లు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి ఆర్టిసి డబుల్ డెక్కర్ బసు కింద పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె సోదరుడికి గాయాలయ్యాయి. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -