Monday, December 23, 2024

విద్యార్థిని కాల్చిచంపిన క్లాస్‌మెట్స్

- Advertisement -
- Advertisement -

10th class student was shot dead by students

విద్యార్థిని కాల్చిచంపిన క్లాస్‌మెట్స్

సహ్రాన్‌పూర్ : ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్‌లో పదవ తరగతి విద్యార్థిని తోటి విద్యార్థులు తుపాకితో కాల్చి చంపారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం కల్గించింది. ఇన్‌స్టాగ్రామ్‌పై తలెత్తిన వివాదంతో ఈ విద్యార్థికి ఇతరులకు ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో తోటి విద్యార్థులే ఈ అబ్బాయిపై కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ విద్యార్థి పేరు వంశ్ పన్వర్ అని నిర్థారణ అయింది. స్కూలు వెలుపలనే ఈ ఘటన జరిగింది. యుపిలోని స్కూళ్లలో ఏకంగా విద్యార్థుల వద్దనే గన్స్ ఉండటం శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News