Wednesday, January 22, 2025

యోగా, ధ్యానంతో ఏకాగ్రత పెరుగుతోంది: మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని,  జర్మనీలో ఇవాళ కోటిన్నర మంది నిత్యం యోగా చేస్తున్నారని, ప్రపంచ యోగా గురువుగా భారత్ మారిందన్నారు. నేడు పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. శ్రీనగర్‌లోని డాల్ సరస్సు నద ఒడ్డున యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. షేర్-ఏ-కశ్మీర్ సమావేశ కేంద్రం వద్ద ప్రధాని మోడీ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని, యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని, యోగాతో శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయని, యోగా నేర్పే మహిళలకు పద్మ శ్రీ అవార్డు కూడా దక్కిందని మోడీ ప్రశంసించారు. భారత దేశంలో అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయని, యోగా, ధ్యానంతో ఏకాగ్రత పెరుగుతోందని, యోగా ఇవాళ కోట్ల మందికి దైనందిన కార్యక్రమంగా మారిందని కొనియాడారు. యోగా ప్రాముఖ్యతను అనేక దేశాల నేతలు తనని అడిగారని, యోగా ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోందన్నారు.

10th International Yoga Day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News