Sunday, December 22, 2024

స్కూల్ లో ఘర్షణ.. పదో తరగతి విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

10th Student dies attack by students in School in Krishna Nagar

హైదరాబాద్: ఘర్షణలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన కృష్ణా నగర్ లో చోటుచేసుకుంది. కృష్ణా నగర్ లోని సాయి కృప స్కూల్ లో పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరగింది. పాఠశాల ప్లే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న సమయంలో గొడవ జరిగింది. బౌలింగ్ సరిగా వేయలేదంటూ మన్సూర్ తో తోటి విద్యార్థులు గొడవకు దిగారు. ఆ తర్వాత క్లాస్ రూమ్ లోకి వచ్చాక మన్సూర్ పై వాటర్ బాటిల్స్ తో దాడి చేశారు. దీంతో అక్కడే కుప్పకూలిపోయిన మన్సూర్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి చేరుకునేలోపే మార్గమధ్యలోనే మన్సూర్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

10th Student dies attack by students in School in Krishna Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News