Saturday, November 23, 2024

‘ఫీజు’ వేధింపులకు విద్యార్థిని బలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మల్కాజిగిరి: ఫీజు విషయంలో ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడ్‌మెట్ ఈస్ట్ కాకతీయ నగర్‌లో నివసించే హరిప్రసాద్ కూతురు యశస్విని (15) స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. పాఠశాల యాజమాన్యం స్కూల్ ఫీజు చెల్లించమని వత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నేరేడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

10th Student suicide due to fee harassment in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News