Monday, January 27, 2025

11న కవితతో సమావేశానికి సిబిఐ అంగీకారం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంబంధించిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని, ఆ తేదీలల్లో ఏ రోజు వచ్చినా వివరణకు సహకరిస్తానని కవిత సిబిఐ అధికారులకు లేఖ రాసిన విషయం తెలిసిందే.

దీంతో స్పందించిన సీబీఐ అధికారులు ఈ నెల 11 వ తేదిన కవితతో సమావేశానికి అంగీకరించారు.ఈ-మెయిల్ ద్వారా సిబిఐ అధికారులు కవితకు సమాచారం ఇచ్చారు.11న హైదరాబాద్లోని కవిత నివాసంలో 11 గంటలకు భేటీ అవుతామని సీబీఐ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News