Sunday, December 22, 2024

అస్సాంలో వరదలు.. ఖజిరంగ పార్కులో 11మృగాలు మృతి

- Advertisement -
- Advertisement -

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని కుంభవృష్టిలో అస్సాం లోని ఖజిరంగ జాతీయ పార్కు( కెఎన్‌పి), పులుల రిజర్వు ప్రాంతం వరదల్లో మునిగిపోయి, అందులోని 11 మృగాలు మృతి చెందాయి. 65 మృగాలను రక్షించ గలిగారు. అంతరించిపోతున్న ఒకే కొమ్మున్న ఖడ్గమృగ జాతిని సంరక్షించడానికి పార్కులో నెలకొల్పిన 233 శిబిరాల్లో 178 శిబిరాలు కనీసం ఐదడుగుల ఎత్తు నీటిలో మునిగిపోయాయని అధికారులు బుధవారం తెలిపారు. వరద నీటి ముంపునకు గురైన 75 శిబిరాలు పార్కు లోని అగ్రతోలి, ఖజిరంగ రేంజిల్లో ఉన్నాయని చెప్పారు. వరద నీటి మట్టం పెరుగుతుండడంతో పార్కు లోని తొమ్మిది శిబిరాలను రద్దు చేశారు.

వరద నీటిలో చిక్కి ఉక్కిరిబిక్కిరి కావడంతో ఈ జంతువులు చనిపోయాయని ఖజిరంగ నేషనల్ పార్కు డైరెక్టర్ సొనాలీ ఘోష్ చెప్పారు. ఏయే జంతువులు చనిపోయాయో ఆయన వివరించలేదు. మృతి చెందిన వాటిలోఖడ్గమృగం పిల్ల, పంది జింక (హాగ్ డీర్) ఉన్నాయని తెలుస్తోంది. మంగళవారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ పార్కు లోని కొన్ని భాగాలను, సమీప ప్రాంతాలను సందర్శించారు. పార్కులో జంతువులను రక్షించడానికి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను, అటవీ సిబ్బందిని నియమిస్తున్నట్టు తెలిపారు. పార్కు లోని వరదల్లో చిక్కుకున్న పులిని బ్రహ్మపుత్ర నదీ ద్వీపమైన మజూలీ ద్వీపంలో గల టొటొయా గ్రామానికి తరలించినట్టు విద్యామంత్రి రనోజీ పెగు మంగళవారం వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News