Wednesday, January 22, 2025

జ్ఞానవాపి మసీదు సర్వే ప్రతుల కోసం 11 దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

వారణాసి : కాశీవిశ్వనాథ్ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పురావస్తు పరిశోధన శాఖ (ఎఎస్‌ఐ) నిర్వహించిన సర్వే నివేదిక ప్రతులను హిందూ, ముస్లిం పక్షాలకు అందజేయడానికి వారణాసి జిల్లా కోర్టు అంగీకరించింది. ఈమేరకు జడ్జి ఎకె విశ్వేశ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే ప్రతులు కావాలని రాఖీసింగ్, తదితరులు పిటిషన్ సమర్పించడంపై కోర్టు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హిందూ, ముస్లిం పక్షాలకు చెందిన 11 మంది ప్రతుల కోసం అభ్యర్థించినట్టు హిందూ వర్గం న్యాయవాది తెలియజేశారు.

గురువారం మధ్యాహ్నం వరకు రెండు వర్గాలకు చెందిన 11 మంది ఆ ప్రతుల కోసం దరఖాస్తు చేశారని యాదవ్ తెలిపారు. ఈ దరఖాస్తుదారుల్లో ఐదుగురు హిందూ వర్గంతోపాటు అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ, కాశీవిశ్వనాథ్ ట్రస్ట్, రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీ, వారణాసి జిల్లా మెజిస్ట్రేట్, ఉన్నారు. జ్ఞానవాపి మసీదుపై ఎఎస్‌ఐ సర్వే నివేదిక ప్రతులు హిందూ , ముస్లిం వర్గాలకు అందజేయడమౌతుందని, దానివల్ల ఏవైనా అభ్యంతరాలుంటే దాఖలు చేయడానికి వీలవుతుందని జిల్లా జడ్జి ఎకె విశ్వేశ్ బుధవారం వెల్లడించారు. గత ఏడాది జులై 21న జిల్లా కోర్టు ఆదేశాలపై జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News