Friday, November 22, 2024

ఉద్యానశాఖ గార్డెన్ ఫెస్టివల్‌లో దక్షిణ మధ్య రైల్వేకు 11 అవార్డులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యానవనశాఖ నిర్వహించిన గార్డెన్ ఫెస్టివల్ లో దక్షిణ మధ్య రైల్వేకు 11 అవార్డులు వరించాయి. తెలంగాణలో 7వ గార్డెన్ ఫెస్టివల్ , 1వ అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ 2023లో ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే వివిధ విభాగాల్లో 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ వ్యాపార సంస్థలు రెసిడెన్సియల్ కాలనీలు తమ ప్రాంగణంలో పచ్చదనాన్ని మెరుగుపరచడానికి అభివృద్ధి చేయడానికి ప్రొత్సహించడానికి గార్డెన్ ఫెస్టివల్ గత ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో ఈ బహుమతులను అందజేయనున్నారు.

కాగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే ల్యాండ్ స్కేప్ గార్డెన్‌లు, ప్రైవేటు కంపెనీలు రక్షణ సంస్థలు ప్రభుత్వ సంస్థలు కార్పొరేషన్‌లు విద్యా సంస్థలు వ్యక్తులు నిర్వహించే తోటలు, వ్యవసాయ గృహాలు పోడియం గార్డెన్‌లు, కూరగాయలు వంటి 12 విభిన్న విభాగాల్లో పోటీలకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే “ 7 వ గార్డెన్ ఫెస్టివల్, 1 వ అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ ,2023” గత జనవరి 10 నుండి 20 వరకు నిర్వహించారు. ఇందులో దక్షిణ మధ్య రైల్వే 11 ఎంట్రీలలో మొదటి బహుమతిని పొందింది. వీటిలో ఐదు రెసిడెన్షియల్ యూనిట్లు అలాగే, నాలుగు స్థాపన యూనిట్లు ఉన్నాయి. కాగా గార్డెన్, అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ 2023లో దక్షిణ మధ్య రైల్వే పదకొండు ప్రథమ బహుమతులు అందుకోవడం పట్ల జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్‌ల ఇంజనీరంగ్ విభాగం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటూ పచ్చదనాన్ని కాపేందుకు యత్నిస్తోందన్నారు. రైల్వే కార్యాలయాలు, నివాసాల మధ్య పర్యావరణం, పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం వల్ల కాలుష్య రహిత వాతావరణాన్ని కాపాడడమే కాకుండా ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా స్వచ్ఛమైన గాలి ప్రసరణను పెంచుతుందని అరుణ్ కుమార్ జైన్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News