Monday, December 23, 2024

భవనం గోడ కూలి 11 మంది కార్మికుల మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో పెషావర్ రోడ్ ఏరియాలో భవనం గోడ కూలి 11 మంది కార్మికులు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా భవనం గోడ కూలిందని పోలీస్‌లు చెప్పారు.శిధిలాల నుంచి మృతదేహాలను వెలికి తీశామని, స్థానిక ఎస్‌పి ఖాన్ జెబ్ చెప్పారు. గాయపడిన ఆరుగురిని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చికిత్స కోసం తరలించామని, వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపారు.

రోడ్ సొరంగం పనిచేస్తున్న కార్మికుల టెంట్‌పై గోడ కూలడంతో ఈ ప్రమాదం సంభవించిందని ఇస్లామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఇఫ్రాన్ నవాజ్ మెమోన్ చెప్పారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషాద సంఘటనకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని ప్రార్థించారు. గత నెల రోజులుగా పాక్‌ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో సెంట్రల్ రీజియన్ ప్రాంతం వరద పరిస్థితిని ఎదుర్కొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News