Saturday, January 11, 2025

11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం

- Advertisement -
- Advertisement -

అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోన్నత ఘట్టాన్ని వీక్షించే అవకాశం లభించడం నా అదృష్టం
ప్రధాని మోడీ ప్రత్యేక ఆడియో సందేశం

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఈ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురు చూస్తోంది.ఈ ప్రాణప్రతిష్ఠకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నందున ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ రోజునుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని పాటిస్తానని తెలిపారు.ఈ మేరకు ఆయన తన అధికారిక యూట్యూబ్ చానల్‌లో ప్రత్యేక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ మహోన్నత ఘట్టాన్ని కనులారా వీక్షించే అవకాశం లభించడం తన అదృష్టమని పేర్కొన్నారు. ‘రామాలయ ప్రాణ ప్రతిష్ఠకు ఇంకా 11 రోజులే మిగిలి ఉంది. ఈ ప్రారంభోత్సవానికి దేశప్రజల తరఫున ప్రతినిధిగా ఉండడం నా అదృష్టం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ రోజునుంచి 11 రోజుల ప్రత్యేక ఆరాధన మొదలుపెడుతున్నాను. ప్రస్తుతం నేను ఎంతో ఉద్వేగంతో ఉన్నాను.

నా మనసులో తొలిసారి ఇలాంటి భావాలు మెదులుతున్నాయి.దీన్ని వర్ణించడానికి మాటలు చాలవు. దేవుడి ఆశీస్సుల వల్లే కొన్ని వాస్తవరూపం దాలుస్తాయి. ఈ ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భం’ అంటూ సందేశం ఇచ్చారు. ఇందుకు ప్రజల ఆశీస్సులను కోరుతున్నానని ఆయన అన్నారు. బిజీ కార్యక్రమాలు, బాధ్యతలు ఉన్నప్పటికీ ప్రధాని మోడీ ప్రాచీన గ్రంధాల్లో పేర్కొన్న నియమ నిబంధనలన్నిటికీ కచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు తెలిపారు. నాసిక్‌లో ధామ్ పంచవటినుంచి తాను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రధాని ఆ సందేశంలో తెలియజేశారు. జనవరి 12న ఛత్రపతి శివాజీ మాతృమూర్తి జన్మదినం. ‘జిజియా బాయి గురించి తలచుకొన్నప్పుడల్లా నాకు నా మాతృమూర్తి గుర్తుకు వస్తుంది.ఆమె తన చరమాంకం వరకు శ్రీరాముడి సేవలో తరించింది’ అని మోడీ ఉద్వేగానికి లోనయ్యారు. నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ 99 ఏళ్ల వయసులో 2022లో కన్నుమూసిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News