Monday, December 23, 2024

ట్రక్కును ఢీకొట్టిన బస్సు: 11 మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని నాషిక్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నందూర్ నాకా ప్రాంతంలో ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 11 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన 38 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 5:20 నిమిషాలకు జరిగిందని నాసిక్ మున్సిపల్ కమిషనర్ చంద్రకాంత్ పుల్కంద్వర్ తెలిపారు. ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంక్ పేలడంతో మంటలు చెలరేగాయన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారని తెలిపాడు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలను అదుకుంటామని షిండే తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని సిఎం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News