Thursday, January 23, 2025

కంఝవాలా కేసులో 11 మంది పోలీసులు సస్పెండ్

- Advertisement -
- Advertisement -

సుల్తాన్‌పురి-కంఝవాలా హిట్ అండ్ డ్రాగ్ భయంకరమైన సంఘటన సమయంలో రోహిణి జిల్లాలో పిసిఆర్ వ్యాన్‌లలో , పికెట్‌లలో విధులు నిర్వహిస్తున్న 11 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని శుక్రవారం సస్పెండ్ చేశారు . డిసిపి స్థాయి అధికారితో పాటు 10 మంది పోలీసులను సస్పెండ్ చేసింది.  దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల యువతి స్కూటర్‌ ఢీకొని మరణించిన రాత్రి మూడు పిసిఆర్‌ వ్యాన్‌లు, రెండు పికెట్ల వద్ద ఉంచిన సిబ్బంది అందరినీ సస్పెండ్ చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి 13 కి.మీ కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News