Wednesday, April 2, 2025

11 అక్రమ నిర్మాణాల కూల్చివేత

- Advertisement -
- Advertisement -
11 Demolition of illegal structures
నాగారంలో ఏడు, నార్సింగిలో మూడు, మణికొండలో ఒకటి

హైదరాబాద్: అక్రమ నిర్మాణాల కూల్చివేతలో జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం దూకుడు పెంచింది. బుధవారం టాస్క్‌ఫోర్స్ బృందం, హెచ్‌ఎండిఎ యంత్రాంగం సంయుక్తంగా మూడు మున్సిపాలిటీల పరిధిలో పదకొండు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంది. నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల ఫిల్లర్లను కూల్చివేశారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్, నార్సింగి ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ అనుమతితో స్లిట్ ప్లస్ రెండు అంతస్తులు అనుమతులు పొంది ఐదు అంతస్తులతో పాటు పెంట్‌హౌస్ నిర్మాణాలు చేసిన మూడు నిర్మాణాలపై టాస్క్‌ఫోర్స్ చర్యలు తీసుకుంది.మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో అక్రమంగా నిర్మించిన ఒక షెడ్డును అధికారులు కూల్చివేశారు. బుధవారం వరకు టాస్క్‌ఫోర్స్ టీమ్స్, హెచ్‌ఎండిఎ యంత్రాంగం 133 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News