Wednesday, January 22, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 11మంది మృతి..

- Advertisement -
- Advertisement -

రాయ్ పూర్: ఛత్తీస్ ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి భాటపరా సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

వివరాల్లోకి వెళితే.. బలోడ బజార్ జిల్లాలో ఒకే కుటుంబానికి సంబంధించిన బందువులందరూ ఓ ఫంక్షన్ కు వెళ్లి నిన్న అర్థరాత్రి తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న వాహనం, భాటపరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమరియా గ్రామం వద్ద ఓ ట్రక్కును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానాకు తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News