Sunday, January 19, 2025

ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలై 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

జకార్తా : ఇండోనేషియా పశ్చిమ ప్రాంతం లోని సుమత్రా దీవిలో ఆదివారం మౌంట్ మరపి అగ్నిపర్వతం బద్దలై 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. మరో 12 మంది గల్లంతయ్యారు. ఈ విస్ఫోటనంతో ఆకాశంలో మూడువేల మీటర్ల ఎత్తు వరకు బూడిద వ్యాపించింది. సమాచారం తెలిసి వెంటనే రెస్కూ బృందాలు ఆ ప్రాంతానికి వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో మొత్తం 75 మంది పర్వతారోహకులు ఉన్నారని తమ వద్ద సమాచారం ఉందని పడాంగ్ సెర్చ్ అండ్ రెస్కూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్ మాలిక్ తెలిపారు.

వారిలో 11 మందిని కాపాడగలిగామని, 11 మంది మరణించారని చెప్పారు. మరో 12 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. కాపాడిన వారిలో స్వల్పంగా గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. వారాంతం కావడంతో పర్వతారోహకులు ట్రెకింగ్ చేసే సమయంలో అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలు కావడంతో ప్రాణనష్టం జరిగిందని అధికారులు తెలిపారు. మౌంట్ మరపి ప్రాంతంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News