Monday, December 23, 2024

పెళ్లి వేడుకల్లో తీవ్ర విషాదం.. బావిలో పడి 11మంది మృతి

- Advertisement -
- Advertisement -

11 Killed after falling in well in UP

లక్నో: ఉత్తర ప్రదేశ్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది.కుషినగర్ జిల్లాలోని నెబువా నౌరంజియాలో వెళ్లి వేడుకల్లో 11మంది మృతి చెందారు. వెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలో బావి స్లాబ్ పై కొంతమంది కూర్చున్నారు. అయితే, ప్రమాదవశాత్తు స్లాబ్ ఒక్కసారిగా కూలడంతో బావిలో పడి 11మంది మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.కాగా, ఈ ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.

11 Killed after falling in well in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News