- Advertisement -
ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న వ్యాన్ బైక్ ను ఢీకొట్టిన ఘటన మధ్యప్రదేశ్ లోని మాందసార్ జిల్లా నారాయణ్ ఖేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచారియా గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కొల్పోయారు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం వేగంగా వెళ్తున్న వ్యాన్ ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. ఆ సమయంలో వ్యాన్ లో ఇద్దరు చిన్నారులతో పాటు 13 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం నుంచి నలుగురు బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.వ్యాన్ డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రతక్ష సాక్షులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -