తిరుపత్తూర్ (తమిళనాడు): తమిళనాడు లోని జువ్వాదిమలై కొండ వద్ద శనివారం అదుపుతప్పి ఓ వ్యాన్ లోయలో పడి 11 మంది మృతి చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యానులో మొత్తం 30 మంది వరకు ఉన్నారు. కొండ ఘాటు రోడ్డు మలుపు వద్ద వ్యాను డ్రైవర్ అదుపు తప్పడంతో ఈ ఘోర ప్రమాదానికి దారి తీసిందని పోలీసులు చెప్పారు. పులియూర్ గ్రామం నుంచి 30 మంది వ్యానులో సెంబరై కొండపై ఉన్న ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50,000 వంతున సాయం ప్రకటించారు. జిల్లా ఆస్పత్రిలో గాయపడిన వారికి చికిత్స సత్వరం అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గాయపడిన మహిళలు, పిల్లలు వాహనానికి దూరంగా నేలపై పడి ఉండడం , వారి చుట్టూ వాటర్ బాటిల్స్, స్లిప్పర్లు చెల్లా చెదురుగా ఉండడం వీడియో దశ్యాలు చూపిస్తున్నాయి. పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.
తమిళనాడులో లోయలో వ్యాన్ బోల్తాపడి 11మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -