Monday, December 23, 2024

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భరత్ పూర్ జిల్లాలోని హంత్రా సమీపంలోని జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును వేంగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

గుజరాత్ నుంచి మధుర వెళ్తున్న పాసెంజర్ బస్సు జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ కావడంతో ప్రక్కకు ఆపారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News