- Advertisement -
అమరావతి: మహిళా సర్పంచ్‌పై 11 మంది అత్యాచారయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ మహిళ సర్పంచ్ తన రేకుల షెడ్డులో పని చేసుకుంటుండగా ఎ శ్రీనివాస్ రావు, ఎల్ వెంకట్ రాజు, ఎల్ సురేష్ కుమార్, ఇ సోమ శేఖర్, పి శ్రీనివాస రావు, పి ప్రసాద్, పి రమణబాబు, పి సుధాకర్, పి మధు, పి జగదీష్, పి భద్రారావులు ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో పాటు కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు రావడంతో నిందితులు పారిపోయారు. మెడబాగం, పొత్తి కడుపు, ఇతర అవయవాలపై దాడి చేసి చిత్ర హింసలకు గురి చేయడంతో పాటు అత్యాచారంచేయడానికి ప్రయత్నించారని దిశ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -