Thursday, January 23, 2025

11 మంది ఎంపీలకు సంసద్ రత్న అవార్డు

- Advertisement -
- Advertisement -
11 MPs will get Sansad Ratna Award
విజేతలలో సుప్రియా సూలే, అమర్ పట్నాయక్

న్యూఢిల్లీ: ఈ ఏడాది(2022) సంసద్ రత్న అవార్డుకు ఎంపికైన 11 మంది ఎంపీలలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) ఎంపి సుప్రియా సూలె, బిజూ జనతాదళ్ ఎంపి అమర్ పట్నాయక్ తదితరులు ఉన్నట్లు ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ మంగళవారం ప్రకటించింది. తమిళనాడుకు చెందిన బిజెపి సీనియర్ నాయకుడు హెచ్‌వి హండే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం వీరప్ప మొయిలీలను జీవిత సాఫల్య అవార్డుకు ఎంపిక చేయడంతోపాటు వ్యవసాయ, ఆర్థిక, విద్య, కార్మిక శాఖలకు చెందిన నాటుగు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు వారు చేసిన సేవలకు గాను అవార్డులకు న్యాయ నిర్ణేతల కమిటీ ఎంపిక చేసింది. సంసద్ రత్న అవార్డుకు ఎంపికైన 11 మందిలో లోక్‌సభ నుంచి 8 మంది, రాజ్యసభ నుంచి ముగ్గురు ఉన్నట్లు ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎన్‌సిపికి ఎంపి సుప్రియా సూలే, ఆర్‌ఎస్‌పి ఎంపి ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్, శివసేన ఎంపి శ్రీరంగ్ అప్ప బర్నేకు సంసద్ విశిష్ట్ రత్న అవార్డు అందచేస్తారు. టిఎంసి ఎంపి సౌగతా రాయ్(పశ్చిమ బెంగాల్), కాంగ్రెస్ ఎంపి కుల్దీప్ రాయ్ శర్మ(అండమాన్, నికోబార్ ద్వీపాలు), బిజెపి ఎంపిలు బిద్యుత్ బారన్ మహతో(జార్ఖండ్), హీనా విజయకుమార్ గావిట్(మహారాష్ట్ర), సుధీర్ గుప్తా(మధ్యప్రదేశ్)లకు సంసద్ రత్న అవార్డులను అందచేస్తారు. రాజ్యసభలో బిజెడి ఎంపి అమర్ పట్నాయక్(ఒడిశ), ఎన్‌సిపి ఎంపి ఫౌజియా తహసీన్ అహ్మద్ ఖాన్(మహారాష్ట్ర)లకు సిట్టింగ్ సభ్యుల కేటగిరిలో 2021లో వారి పనితీరుకు గాను అవార్డులను అందచేస్తారు. 2021లో రిటైరయిన సభ్యుల కింద సిపిఎం ఎంపి కెకె రాగేష్(కేరళ)కు అవార్డు అందచేస్తారు. ఈ నెల 26న దేశ రాజధానిలో 12వ సంసద్ రత్న అవార్డు ప్రదానోత్సవం జరగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News