Wednesday, January 22, 2025

బీహార్‌లో పిడుగుపాటుకు 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

11 people died due to lightning in Bihar

రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా: నితీష్

పాట్నా: బీహార్‌లోని వివిధ ప్రాంతాలలో సోమవారం రాత్రి పిడుగులతో కురిసిన భారీ వర్షానికి 11 మంది మరణించారు. మృతుల కుటుంబాలకు రూ 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. పూర్నియా, అరారియాలో నలుగురు చొప్పున, సుపోల్‌లో ముగ్గురు పిడుగుపాటుకు మరణించారని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎక్స్‌గ్రేషియాను తక్షణమే అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దుర్ఘటనలను నివారించడానికి విపత్తు నివారణ శాఖ సూచనలను పాటించాలని ఆయన కోరారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News