Wednesday, January 22, 2025

‘రక్తమోడిన’ రహదారి

- Advertisement -
- Advertisement -

వేర్వేరు ప్రమాదాల్లో 11మంది దుర్మరణం

కామారెడ్డి జిల్లాలో ఐదుగురు, నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు, కర్నాటకలో నలుగురు హైదరాబాద్ వాసుల మృతి

మన (బిచ్కుంద/కామారెడ్డి): రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11మంది మృ త్యువాత పడ్డారు. కామారెడ్డి జిల్లాలో ఐదుగురు, ఇద్దరు, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లో హైదరాబాద్‌కు చెందిన నలుగురు వివిధ రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం చెందారు. మద్నూరు మండలం మేనూర్ వద్ద రాంగ్ రూట్‌లో వచ్చిన ఆటో లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జు నుజ్జయింది. కంటైనర్ లారీ హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్తుండగా, మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు రాంగ్ రూట్‌లో వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ కిందకు దూసుకెళ్లింది. ఆటోలో ప్ర యాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి.

ఈ ఘటనలో మే నూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి కృష్ణ(17) మద్నూర్ జూనియర్ కళాశాల నుంచి మేనూరుకు రెండు నిమిషాల్లో చేరుకుంటాననగా మృత్యుఒడికి చేరాడు. మిగిలిన వారిలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి సమీపంలోని బాంలికి చెందిన మహాజన్ (50), అశ్వాక్(36)గా పోలీసులు గుర్తించా రు. మరో ఇద్దరు మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అలాగే నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం ఉదయం 5 గంటల సమయంలో జాతీయ రహదారి నం.44పై నిలిపి ఉంచిన లారీని కంటైనర్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన బాల్కొండ పిఎస్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రాయచూర్‌లో నలుగురు

గోవా నుంచి కారులో తిరిగి వస్తుండగా కర్నాటకలోని రాయచూర్ జిల్లా సింధనూర్ వద్ద బాలాజీ క్యాంపు సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ క్రమంలో ప్రమాద ఘటనకు చేరుకున్న పోలీసులు మృతులు ప్రదీప్ (35), పూర్ణిమ (30), జితిన్ (12), మహీన్ (7)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న బలగనూరు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News