Wednesday, January 22, 2025

బీహార్ కల్తీమద్యం ఘటనలో 11కు చేరిన మరణాలు

- Advertisement -
- Advertisement -

 

బీహార్‌షరీఫ్: బీహార్‌లోని నలంద జిల్లా కేంద్రం బీహార్‌షరీఫ్‌లో కల్తీమద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. శనివారం ఎనిమిదిమంది చనిపోగా, ఆదివారం ఉదయం మరో ముగ్గురు మృతి చెందారని స్థానిక ఎస్‌పి అశోక్‌మిశ్రా తెలిపారు. 8మంది శవాలను పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పజెప్పామని ఆయన తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. బీహార్‌లో 2016 ఏప్రిల్ నుంచి మద్య నిషేధం అమలులో ఉన్నది. స్థానికంగా అక్రమ మద్యం అమ్మకాలను అడ్డుకోవడంలో విఫలమయ్యారన్న కారణంతో ఎస్‌హెచ్‌ఒను సస్పెండ్ చేశారు. మృతులంతా శుక్రవారం రాత్రి మద్యం సేవించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. రెండు నెలల క్రితం బీహార్‌లోని నాలుగు జిల్లాల్లో కల్తీమద్యం తాగి 40మంది చనిపోయిన తర్వాత ఇదే మొదటి ఘటన.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News