Monday, January 20, 2025

హైదరాబాద్ పేలుళ్ల కేసులో 11 మందికి పదేళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పేలుళ్ల కేసులో ఢిల్లీ ఎన్‌ఐఎ కోర్టు తీర్పు వెలువరించింది. పదకొండు మంది నిందితులకు పదేళ్లు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కీలక సూత్రధారి ఒబైద్ ఉర్ రెహమాన్‌తో పాటు మరో పది మందికి ఈ జైలు శిక్ష విధించింది. రెహమాన్ గ్యాంగ్ విదేశాల నుంచి పేలుడు పదార్థాలు తెచ్చింది. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్థాలు తెచ్చి భారత్‌లో రెహమాన్ పేలుళ్లకు కుట్రకు తెరలేపింది. అయితే పేలుళ్ల కుట్ర కేసును తెలంగాణ పోలీసులు ముందస్తుగా భగ్నం చేశారు. 2012 పాకిస్థాన్ నుంచి భారత్‌కు పేలుడు పదార్థాలు తెచ్చి హైదరాబాద్‌లో దాడులకు యత్నించిన కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటి వరకూ 11 మందిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. జూలైలో నలుగురు నిందితులు దినేష్ అన్సారి, ఆఫ్తాబ్ అలామ్, ఇమ్రాన్ ఖాన్, ఒబైద్ ఉర్ రెహమాన్‌లకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా ఐదో నిందితుడు మగ్బూల్‌కి జైలు శిక్ష విధించింది. కేసులో మరో ఆరుగురు నిందితులకు కోర్టులో ట్రయల్ కొనసాగుతుందని ఎన్‌ఐఎ పేర్కొంది.

పదకొండు మందికి పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ ఎన్‌ఐఎ కోర్టు తీర్పు చెప్పడంతో తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన నిందితులు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు తీర్పు రావడంతో హైదరాబాద్‌పై కుట్రకు పాల్పడ్డవారికి తగిన శిక్ష పడిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే, ముజాహిద్దీన్ కుట్రగా ఈ కేసు ప్రాచుర్యం పొందింది. ఇప్పటికే ఈ కేసులో మగ్బూల్‌ను సెప్టెంబర్ 22వ తేదీన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది. ఇక, ఈ కేసులో ఐదవ నిందితుడిగా మగ్బూల్ ఉన్నాడు. నాందేడ్‌కు చెందిన మగ్బూల్‌ను ఉగ్ర కదలికల నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్‌లోని కీలక సభ్యులతో మగ్బూల్ దగ్గరి సంబంధాలను కలిగి ఉన్నట్లు ఎన్‌ఐఎ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News